కృష్ణా జిల్లా నందిగామ మండలం కేతవీరునిపాడులో మొక్కపాటి శ్రీనివాసరావు అనే వ్యక్తి సెల్ఫోన్ విషయమై ఇద్దరితో గొడవ పడ్డాడు. జమ్ముల పుల్లారావు దంపతులపై విచక్షణ రహితంగా కర్రతో దాడి చేశాడు. ఈ ఘటనలో భార్య, భర్తలు ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని స్థానికులు హుటాహుటిన విజయవాడలోని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్సపొందుతూ పుల్లారావు మృతి చెందాడు. అతని భార్య విషమ పరిస్థితుల్లో చికిత్స పొందుతోంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
సెల్ఫోన్ గొడవ.. నిండు ప్రాణం బలి
ఆ సెల్ఫోన్లో ఏముందో తెలియదు కానీ.. గొడవ జరిగింది. కర్రలతో దాడి జరిగింది. చివరకు ఓ ప్రాణం బలైంది.
Man killed for cellphone at Ketavirunipadu in krishna