Sheep dead: కృష్ణాజిల్లా నందివాడ మండలం అరిపిరాల గ్రామంలో లారీ బీభత్సం సృష్టించింది. రోడ్డుపై వెళ్తున్న గొర్రెల మందపైకి స్పీడ్‌గా వచ్చిన లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 70 గొర్రెలు మృతి చెందాయి.
హనుమాన్ జంక్షన్ మండలం వేల్పెరు నుండి గుడివాడ వైపు గొర్రెల మంద వెళ్తుండగా.. హనుమాన్ జంక్షన్ నుండి వస్తున్న లారీ వేగంగా గొర్రెల మందపైకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ పరారయ్యాడు.. లారీ మైలవరానికి చెందినదిగా పోలీసులు గుర్తించారు. గొర్రెల కాపరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నందివాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెద్ద ఎత్తున గొర్రెలు మృతి చెందడంతో కాపరి లబోదిబోమని విలపిస్తున్నాడు.