ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కలెక్టర్‌ సమావేశంలో అధికారుల కునుకుపాట్లు

సార్వత్రిక ఎన్నికల తంతు దాదాపు ముగిసింది. ఇక మిగిలింది స్థానిక సంస్థల ఎన్నికలు. కీలమైన ఈ సమరంలో అనుసరించాల్సిన వ్యూహాలపై కృష్ణాజిల్లా కలెక్టర్ ఓ సమావేశం నిర్వహించారు. జిల్లా యంత్రాంగమంతా హాజరైంది. బయట ఎండ వేడి... లోపల ఏసీ గాలి... ఇంకేముంది. ప్రశాంతంగా కునుకేశారు.

కలెక్టర్‌ సమావేశంలో అధికారుల కునుకుపాట్లు

By

Published : Apr 25, 2019, 7:42 PM IST

కలెక్టర్‌ సమావేశంలో అధికారుల కునుకుపాట్లు

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై చర్చకు వచ్చిన జిల్లా అధికారులు ఓ కునుకు తీశారు. ఎండ ధాటికి అలసిపోయారో..! సమావేశం బోర్ కొట్టిందో తెలీదు కానీ. గురకపెట్టి మరీ నిద్రలో మునిగిపోయారు.
కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ఆధ్వర్యంలో విజయవాడలో ఈ సమావేశం జరిగింది. తహసీల్దార్లు, ఎంపీడీవోలు, వీఆర్వోలు, గ్రామ కార్యదర్శులు అంతా హాజరయ్యారు. ఇప్పటికే సార్వత్రిక ఎన్నికల్లో చాలా చోట్ల ఘర్షణలు జరిగాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో అలాంటివి జరగకుండా ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి. సమస్యాత్మక ప్రాంతాల విషయంలో ఏం చేయాలి... ఓటర్ల జాబితాను ఎప్పటిలోపు సిద్ధం చేయాలి వంటి అంశాలపై చర్చ జరుగుతుండగా... కొందరు అధికారులు ఇలా ప్రశాంతంగా ఓ కునుకు తీశారు.
ఉన్నతాధికారులు సూచనలు శ్రద్ధగా విని ఆచరించాల్సిన సిబ్బంది... చల్లని ఏసీలో....గురకపెట్టి మరీ కునుకు తీయడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. తహసీల్దార్లు, ఎంపీడీవోలు, వీఆర్వోలు, గ్రామ కార్యదర్శులు ఇలా వ్యవహరించడమేంటని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details