లారీ, బైక్ ఢీ... యువతి దుర్మరణం - lady died
కృష్ణా జిల్లాలో బైకును లారీ ఢీ కొట్టిన ఘటనలో.. యువతి దుర్మరణం చెందింది.
రోడ్డు ప్రమాదంలో యువతి దుర్మరణం
కృష్ణా జిల్లా గన్నవరం దగ్గర చెన్నై - కోల్కతా జాతీయ రహదారిపై... విజయవాడ శివారు నిడమానూరులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఘంటసాల మండలం గోగినేనిపాలెంకు చెందిన కుంపటి మనీషా (22) అక్కడికక్కడే మృతి చెందింది. విజయవాడలో ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న మనీషా తన స్నేహితునితో కలిసి బైక్పై వెళ్తుండగా వెనక నుంచి లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో.. మనీషా తల గుర్తు పట్టలేని విధంగా ఛిద్రమైంది.
Last Updated : Jul 1, 2019, 12:01 PM IST