కృష్ణా జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి... పట్టణంలో అమలవుతున్న లాక్ డౌన్‌ను అధికారులతో కలిసి పర్యవేక్షించారు. పురపాలక సంఘ కార్యాలయంలో ఉద్యోగులకు మాస్కులు, శానిటైజర్లు, గ్లౌజులు పంపిణీ చేశారు. జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్‌ను సందర్శించి.. వినియోగదారుల సమస్యలు తెలుసుకున్నారు. చౌక ధరల దుకాణాల్లో రెండో విడత రేషన్ సరుకుల పంపిణీని పరిశీలించారు. భగత్‌సింగ్ నగర్ కాలనీలో కరోనా వైరస్ నివారణకు రసాయన ద్రావణం పిచికారీని ప్రారంభించారు.
లాక్ డౌన్ అమలును పర్యవేక్షించిన ఎమ్మెల్యే రక్షణనిధి - తిరువూరులో లాక్ డౌన్‌ను పరిశీలించిన ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి
కృష్ణా జిల్లా తిరువూరు పురపాలక సంఘ ఉద్యోగులకు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి మాస్కులు, శానిటైజర్లు, గ్లౌజులు అందజేశారు. పట్టణంలో అమలవుతున్న లాక్ డౌన్‌ను అధికారులతో కలిసి పర్యవేక్షించారు.
![లాక్ డౌన్ అమలును పర్యవేక్షించిన ఎమ్మెల్యే రక్షణనిధి krishna district tiruvuru mla kokkiligadda rakshnana nidhi distribute masks sanitizers to muncipal employees](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6839682-671-6839682-1587199117963.jpg)
ఉద్యోగులకు శానిటైజర్లు అందజేస్తున్న ఎమ్మెల్యే రక్షణనిధి