ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 27, 2021, 9:30 PM IST

ETV Bharat / state

52 ఆస్పత్రులకు రూ.3.61కోట్లు జరిమానా

కృష్ణా జిల్లాలోని పలు ఆస్పత్రుల్లో జేసీ శివశంకర్ తనిఖీలు చేశారు. ప్రభుత్వ నిబంధనలు పాటించని 52 ఆస్పత్రులపై రూ.3.61కోట్లు జరిమానా విధించినట్లు తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

జేసీ శివశంకర్ తనిఖీలు
జేసీ శివశంకర్ తనిఖీలు

కృష్ణా జిల్లాలో కరోనా చికిత్స అందిస్తున్న పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో జేసీ శివశంకర్ తనిఖీలు చేపట్టారు. గత రెండు రోజుల్లో నిబంధనలు పాటించని 35 ఆస్పత్రులపై రూ.2.86 కోట్లు జరిమానా విధించారు. కరోనా చికిత్స కోసం అందించే ఆరోగ్య సేవల్లో 50 శాతం ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ కలిగిన వారికి చికిత్స అందించాలని జేసీ సూచించారు.

జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 52 ఆస్పత్రులపై రూ.3.61 కోట్లు జరిమానా విధించినట్లు జేసీ శివశంకర్ వెల్లడించారు. కొవిడ్ చికిత్సకు వసూలు చేస్తున్న ఫీజుపై నోడల్ అధికారులు, ఆస్పత్రి పర్యవేక్షకులు బాధ్యత వహించాలని ఆదేశించారు. రోగులు చెల్లించిన నగదుకు బిల్లులు ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వం మార్గదర్శకాలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జేసీ హెచ్చరించారు.

ఇదీచదవండి.

AP Corona Casess: రాష్ట్రంలో కొత్తగా 16,167 కరోనా కేసులు, 104 మరణాలు నమోదు

ABOUT THE AUTHOR

...view details