నాలుగు రోజులుగా ఎగువ ప్రాంతాల నుంచి వచ్చి చేరుతున్న వరదనీటి ప్రవాహంతో ప్రకాశం బ్యారేజ్ నీటి ప్రవాహం క్రమేపీ పెరుగుతోంది. ఇప్పటికే 15 అడుగుల పైగా బ్యారేజి లో నీటిమట్టం పెరుగగా బ్యారేజ్ గేట్ల పై నుంచి వరద ప్రవాహిస్తోంది...భవానీపురంలోని శ్రీకృష్ణ చైతన్య విద్యా విహార్ ట్రస్ట్ లోకి వరద నీరు చేరిన కారణంగా... నిర్వహకులు ముందు జాగ్రత్తగా విద్యార్థులను ఖాళీచేయించారు. ట్రస్ట్ పక్కనే వీటీపీఎస్ పంప్ హౌస్ ఉన్నందువల్ల... అప్రమత్తమైన విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. 100 మందికిపైగా ట్రస్ట్‌లో ఆశ్రయం పొందుతున్న వీధి బాలురను సురక్షిత ప్రాంతానికి తరలించామని ఎస్‌కేసీవీ ట్రస్ట్ ఛైర్మన్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి వివరించారు. సమాచారం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ట్రస్ట్ ను పరిశీలించారు.
ఎస్కేవీసీ ట్రస్ట్ లోకి భారీగా వరదనీరు - SKCV TRUST
విజయవాడ భవానిపురం శ్రీకృష్ణ చైతన్య విద్యా విహార్ ట్రస్ట్ లోకి వరద నీరు భారీగా చేరింది. ముందు జాగ్రత్తగా అధికారులు, ట్రస్ట్ నిర్వహకులు విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కలెక్టర్ ఇంతియాజ్ ట్రస్టు వద్దకు చేరుకుని ప్రస్తుత పరిస్థితులపై ఆరా తీశారు
ఎస్కేవీసీ ట్రస్ట్ లో భారీగా వరదనీరు.. సురక్షిత ప్రాంతాలకు విద్యార్థుల తరలింపు