బందరు పోర్టు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాలని మాజీమంత్రి కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు. బందరు పోర్టును... రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సర్కారుకు అప్పగించిందని ఆరోపించారు. ఈ విషయంపై గతనెలలో జీవోఆర్టీ-62 నెంబర్ ద్వారా కేసీఆర్, జగన్‌మోహన్ రెడ్డిల మధ్య రహస్య ఒప్పందం జరిగిందన్నారు. ఏడాదిన్నర వ్యవధిలో రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకుని పోర్టు నిర్మించాలని... లేనిపక్షంలో ప్రజా ఉద్యమాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని కొల్లు హెచ్చరించారు.
'కేసీఆర్, జగన్‌ల మధ్య రహస్య ఒప్పందం' - Kollu Ravindra
తెలంగాణ సీఎం కేసీఆర్, జగన్‌మోహన్ రెడ్డిల మధ్య బందరు పోర్టు గురించి రహస్య ఒప్పందం జరిగిందని మాజీమంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. మచిలీపట్నంలోని తెదేపా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
కొల్లు రవీంద్ర