దొంగలకు ఊరంతా దొంగలుగానే కనపడతారు: కేశినేని - budha
విజయవాడ ఎంపీ కేశినేని, బుద్దా వెంకన్నల మధ్య ట్విట్టర్ వార్ కొనసాగుతూనే ఉంది. కేశినేని నాని మరో ట్వీట్ చేశారు. ప్రబుద్ధుడు చెప్పింది అక్షర సత్యమంటూ వ్యాఖ్యానించారు.
nani
కేశినేని నాని ట్వీట్లు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రబుద్ధుడు చెప్పింది అక్షర సత్యమంటూ ఇవాళ మరో ట్వీట్ చేశారు. తాను నంబర్ ప్లేట్లు మార్చి వ్యాపారం చేసినా... ఫైనాన్షియర్లకి డబ్బులు ఎగ్గొట్టి వ్యాపారం చేసినా... ఏళ్ల తరబడి కేశినేని ట్రావెల్స్ మూసుకునే పరిస్థితి వచ్చేది కాదన్నారు. ఆస్తులు అమ్ముకునే దుస్థితి వచ్చేది కాదని పేర్కొన్నారు. దొంగకి ఊరంతా దొంగలులానే కనపడతారని కేశినేని నాని వ్యాఖ్యానించారు.