కృష్ణాజిల్లా నూజివీడు మండలం మీర్జాపురం గ్రామంలో సీపీ మొక్కజొన్న సీడ్ కంపెనీ వద్ద రైతులు ఆందోళన చేస్తున్నారు. రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ..... హనుమంత్ రెడ్డి కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం రుద్రవరం గ్రామంలో గత ఖరీఫ్ సీజన్లో 210 ఎకరాల్లో సీపీ మొక్కజొన్న సాగు చేశారని.. ఎకరాకు 25 నుంచి 35 క్వింటాల దిగుబడి వస్తుందని కంపెనీ ఆర్గనైజర్ ప్రసాద్చెప్పారు. కానీ 6క్వింటాలైనా రాలేదని వాపోతున్నారు. సుమారుగా కోటి రూపాయల పరిహారం అందించాల్సి ఉందని రైతులు తెలిపారు. కంపెనీ కేవలం 16 లక్షలు ఇస్తానని ప్రకటించడం దారుణమని హనుమంత్ రెడ్డి అన్నారు. ఆళ్లగడ్డ నుంచి ఇప్పటి వరకు 5 సార్లు కంపెనీ వద్దకు వచ్చామనీ దీని కోసం 2 లక్షలు వరకు ఖర్చైనట్టు తెలియజేశారు. రైతులకు న్యాయం జరిగేంత వరకు కంపెనీ వద్ద నుంచి వెళ్ళేది లేదని రైతన్నలు ఆందోళన చేపట్టారు.
కృష్ణాజిల్లాలో మొక్కజొన్న రైతుల ధర్నా - నూజివీడు మండలం
కృష్ణాజిల్లా మీర్జాపురం గ్రామంలో సీపీ మొక్కజొన్న సీడ్ కంపెనీ వద్ద రైతులు ఆందోళనకు దిగారు.సీపీ కంపెనీ తమను మోసం చేసిందంటూ.. పరిహారం కావాలనీ రైతుల ధర్నాచేస్తున్నారు.
కృష్ణాజిల్లాలో మెక్కజొన్న రైతుల ధర్నా