విజయవాడలో మిషన్ సాహసి పేరుతో అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో కళాశాలల విద్యార్థులకు ఆత్మస్థైర్యం - స్వీయరక్షణపై కరాటే శిక్షణ తరగతులు నిర్వహించారు. లైంగిక దాడుల నుంచి తమను తాము కాపాడుకోవడానికి ఈ శిక్షణ కార్యక్రమం ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు. విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం నింపటానికి ఏబీవీపీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సాహసం అనే కార్యక్రమం చేపడతామని తెలిపారు. నగరంలోని సంగీత కళాశాల ఆవరణలో విద్యార్థులతో మిషన్ సాహసి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
మిషన్ సాహసి పేరుతో విద్యార్థినులకు కరాటే శిక్షణ - ఆత్మధైర్యం-స్వీయరక్షణపై కరాటే శిక్షణ వార్త
మిషన్ సాహసి పేరుతో ఏబీవీపీ ఆధ్వర్యంలో విజయవాడలోని పలు కళాశాలల విద్యార్థినులకు ఆత్మస్థైర్యం - స్వీయరక్షణపై కరాటే శిక్షణ తరగతులు నిర్వహించారు. లైంగిక దాడుల నుంచి తమను తాము కాపాడుకునేందుకు ఈ శిక్షణ ఎంతగానే ఉపకరిస్తుందని నిర్వాహకులు తెలిపారు.
![మిషన్ సాహసి పేరుతో విద్యార్థినులకు కరాటే శిక్షణ Karate training on self-confidence at vijayawada](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5348281-167-5348281-1576143838009.jpg)
ఆత్మధైర్యం-స్వీయరక్షణపై కరాటే శిక్షణ