ఇళ్ల పట్టాల పేరుతో వైకాపా ప్రభుత్వం పెద్దఎత్తున అవినీతికి పాల్పడుతోందని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు ఆరోపించారు. ఇప్పటికే ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వానికి భూములిచ్చిన రైతుల నుంచి రూ. 1,400 కోట్లు కమీషన్లు వసూలు చేశారని కళా అన్నారు. ఇళ్ల స్థలాలు ఇస్తామని పేదల నుంచి మరో రూ.200 కోట్లు వసూలు చేశారని.. ఇప్పటికే మొత్తం రూ. 1600 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు.
'ఇళ్ల పట్టాల పేరుతో పెద్ద ఎత్తున అవినీతి చేస్తున్నారు'
వైకాపా ప్రభుత్వం ఇళ్ల పట్టాల పేరుతో ఇప్పటికే రూ.1600 కోట్ల అవినీతికి పాల్పడిందని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు ఆరోపించారు. ఇళ్ల స్థలాల పథకం ప్రక్రియ ప్రారంభం కంటే రెండు నెలల ముందు రాష్ట్రవ్యాప్తంగా జరిగిన భూ అమ్మకం, కొనుగోళ్లపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
పేదలకు ఇళ్ల స్థలాలపై కళా వెంకట్రావు
ఇళ్ల స్థలాల పథకం ప్రక్రియ ప్రారంభం కంటే రెండు నెలల ముందు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన భూ అమ్మకం, కొనుగోళ్లపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని కళా డిమాండ్ చేశారు. ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం కొనుగోలు చేసే భూములన్నీ స్ధానిక వైకాపా నేతలవేనని ఆరోపించారు. మార్కెట్ ధర కంటే అధికంగా భూములు కొనుగోలు చేస్తున్నారని కళా వెంకట్రావు అన్నారు.
ఇదీ చదవండి: టోల్గేట్ వద్ద మాజీ ఎంపీ వీరంగం.. పోలీసులపై దాడి!