ప్రకాశం బ్యారేజి నుంచి కృష్ణా నదిలోకి భారీగా వరద నీరు చేరుతోంది. కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం పాత ఎడ్ల లంక గ్రామాల మధ్య ఉన్న కాజ్ వే పూర్తిగా కోతకు గురైంది. గత నెలలో వచ్చిన వరద ఉధృతికి కాజ్ వే దెబ్బతిన్నందున... ప్రత్యామ్నాయ రహదారిని ఏర్పాటుచేశారు. మరోసారి వరద రాగా.. ఈ సారి పూర్తిగా దెబ్బతింది. ప్రత్యామ్నాయంగా ప్రజలు పడవ ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ, పోలీసు సిబ్బంది వెంటనే వచ్చి పరిస్థితిని పరిశీలించారు. ఎడ్లలంక గ్రామానికి వంతెన నిర్మాణం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
మా గ్రామానికి వంతెన నిర్మించండి... - prakasam barrage
కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం పాతయడ్లంక గ్రామాల మధ్య ఉన్న కాజ్ వే... పూర్తిగా కోతకు గురైంది. చుట్టూ ఉన్న పరిసర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సమస్య పరిష్కారానికి వంతెన నిర్మాణం చేయాలని స్థానికులు కోరుతున్నారు.
విజయవాడలోని పాత ఎడ్లలంక గ్రామంలో పూర్తాగా కోతకు గురైన కాజ్వే