ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అదే వారికి నోటీసులు ఇవ్వాల్సి వస్తే.. లారీలలో తీసుకెళ్లాలి' - ఈరోజు జేసీ దివాకర్ రెడ్డి తాజా వ్యాఖ్యలు

వైకాపా తీరుపై జేసీ దివాకర్‌రెడ్డి మండిపడ్డారు. సీఐడీ అధికారులు తెదేపా అధినేత చంద్రబాబుకు నోటీసులు ఇవ్వటంపై.. హైదరాబాద్​లోని సీఎల్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు.

JC Diwakar Reddy
జేసీ దివాకర్ రెడ్డి

By

Published : Mar 16, 2021, 5:26 PM IST

హైదరాబాద్​లోని సీఎల్పీ కార్యాలయానికి వెళ్లిన జేసీ దివాకర్‌రెడ్డి చంద్రబాబుకు రాష్ట్ర సీఐడీ అధికారులు ఇచ్చిన నోటీసులపై స్పందించారు. చంద్రబాబుకు ఇంత ఆలస్యంగా నోటీసులివ్వడమే ఆశ్చర్యంగా ఉందని.. మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. వైకాపా ప్రభుత్వంలో ప్రత్యర్థులకు నోటీసులివ్వడం సర్వసాధారణమైపోయిందన్నారు.. చంద్రబాబుకు పోలీస్ అధికారి వచ్చి మాత్రమే నోటీసులిచ్చారన్న ఆయన.. అదే జగన్, విజయసాయిలకు నోటీసులు ఇవ్వాల్సి వస్తే లారీలో తీసుకెళ్లాలని ఎద్దేవా చేశారు.

ABOUT THE AUTHOR

...view details