జనసేన విడుదల చేసిన జాబితా శాసనసభ ఎన్నికలకు.. జనసేన మరో జాబితా విడుదల చేసింది. 16 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. అత్యధికంగా అనంతపురం జిల్లా నుంచి 5 స్థానాలకు.... అత్యల్పంగా కడప జిల్లాలో ఒక స్థానానికి అభ్యర్థులను వెల్లడించారు. హిందూపురంలో బాలకృష్ణకు పోటీగా ఆకుల రమేశ్‌ను జనసేన బరిలోకి దింపింది. పరిటాల శ్రీరామ్ పోటీ చేస్తున్న రాప్తాడు నియోజకవర్గానికి సాకె పవన్ కుమార్‌ను ప్రకటించింది. ప్రతిపక్ష నేత జగన్‌కు పులివెందులలోప్రత్యర్థిగా తుపాకులచంద్రశేఖర్ను బరిలోకి దింపింది.