రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవాళ కాకపోతే రేపైనా వస్తుందని సీఎం జగన్ ఆశాభావం వ్యక్తం చేశారు. విభజనతో రాష్ట్రానికి తీరని నష్టం జరిగిందన్న ఆయన.. విభజనకు ముందు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఇవ్వలేదన్నారు. పరిశ్రమలు, పెట్టుబడుల అంశంపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మేధోమథన సదస్సులో మాట్లాడిన సీఎం.. ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే పరిశ్రమలకు ఇంకా ఎక్కువగా ప్రోత్సాహకాలు వచ్చేవని పేర్కొన్నారు.
అందుకే అడగలేకపోతున్నాం..