కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో చల్లపల్లి, ఘంటసాల, మోపిదేవి మండలాల్లో వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. జిల్లా నుంచే కాకుండా పక్క జిల్లా అయిన గుంటూరు నుంచి కూడా కోతలు కోసేందుకు కూలీలు వస్తున్నారు. దీంతో వరి కోత రేటును ఒక్కసారిగా మూడు రెట్లు పెంచేశారు. ఒక్కో ఎకరానికి 10వేలు నుంచి 12 వేలు వరకు కూలి ఖర్చులు అవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కురిసి వర్షాలకు 80శాతం పంట నేలకొరింది. మిగిలిన పంటను కోత కోద్దామంటే నివర్ తుఫాన్ హెచ్చరికలతో కూలీలు అధిక మొత్తంలో డిమాండ్ చేస్తున్నారని రైతులు వాపోతున్నారు.
రెండో పంటగా మినుము విత్తనాలు చల్లిన పొలంలో వరి కోత కోయకపోతే.. మినుములు మొలెకెత్తుతాయని, అనంతరం కోత సమయంలో ఆ మొక్కలు తెగిపోయి.. ఆయా పంటను నష్టపోవాల్సి వస్తుందంటున్నారు. ఇలాంటి పరిస్థితులకు నివర్ తుఫాన్ తోడు కావటం.. ఒక్కసారిగా కూలీలు మూడు రెట్లు కూలి రెట్లు పెంచటంతో ఏం చేయాలో పాలుపోని దుస్థితిలో ఉన్నామని రైతులు ఆందోళన చెందుతున్నారు.