పెంపకందారులు తమ ఆవుల విషయంలో సరైన శ్రద్ధ తీసుకోకుండా... రోడ్లపై వదిలేస్తే జరిమానా విధిస్తామని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్నవెంకటేష్ హెచ్చరించారు. ట్రాఫిక్, పారిశుద్ధ్య నిర్వహణకు ఆవులు ఇబ్బంది కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. రోడ్లపైకి వదలకుండా ఇంటి పరిసరాల్లోనే ఉంచుకోవాలని నగరపాలక సంస్థ స్పష్టం చేసింది. లేనిపక్షంలో ప్రజారోగ్య చట్టాన్ని అనుసరించి చర్యలు తీసుకుంటామని తెలిపింది. కమిషనర్ ఆదేశాల మేరకు ప్రజారోగ్య సిబ్బంది విజయవాడలోని స్వరాజ్ మైదానం, బీసెంట్ రోడ్డు, కృష్ణలంక ప్రాంతాల్లో రోడ్లపై సంచరిస్తోన్న 40 ఆవులను... రాజరాజేశ్వరిపేటలోని కాటిల్‌షెడ్‌కు తరలించారు.
'గోవులను రోడ్లపై వదిలేస్తే... చర్యలు తప్పవు'
విజయవాడ నగరంలో గోవులు రోడ్లపై తిరగడానికి వీల్లేదంటూ... నగరపాలక సంస్థ హెచ్చరించింది. గోవులను వదిలేస్తే చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్నవెంకటేష్ హెచ్చరించారు.
గోవులను రోడ్లపై వదిలెస్తే కఠిన చర్యలు