ETV Bharat / state

అన్యమత ప్రచారకులకు హెచ్చరిక..!

తమ గ్రామంలో అన్యమత ప్రచారం చెయ్యడానికి వీల్లేదంటూ... ఆ ఊరంతా ఒకే మాటపై నిలబడింది. అలా చేస్తే చర్యలు తీసుకుంటామంటూ... గ్రామంలోకి వెళ్లే దారిలో బ్యానర్​ ఏర్పాటు చేశారు గ్రామస్థులు.

villagers objected to enter pagans to their village kolaganivari palem guntur district
కొలగానివారిపాలెం గ్రామం
author img

By

Published : Nov 30, 2019, 5:29 PM IST

అన్యమత ప్రచారకులకు హెచ్చరిక..!

గుంటూరు జిల్లా నగరం మండలం కొలగానివారిపాలెం గ్రామం మొత్తం హిందువులే. ఇటీవల కొంతమంది అన్యమత ప్రచారకులు ఆ ఊరిలోకి వచ్చి 'మతం మార్చుకోండి... అలా చేస్తే ఎన్నో ప్రయోజనాలున్నాయి'అంటూ... ప్రలోభాలకు గురిచేస్తున్నారని గ్రామస్థులు తెలిపారు. తమ స్వలాభం కోసం గ్రామస్థులను మతమార్పిడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఇకపై అలాంటివి జరగకుండా... ఊరంతా కలిసి ఒక నిర్ణయం తీసుకున్నామనీ... 'మత ప్రచారం చేయొద్దని' గ్రామ సరిహద్దులో బ్యానర్​ను ఏర్పాటు చేసినట్లు గ్రామస్థులు వివరించారు. మతం మార్చుకుంటే కన్నతల్లిని మార్చుకున్నట్లేనని.. ఎవరూ ప్రలోభాలకు గురై... మతం మారొద్దని గ్రామపెద్దలు సూచించారు.

ఇవీ చదవండి..

సినీ రచయిత రామజోగయ్యశాస్త్రికి గురజాడ పురస్కారం

Intro:ap_gnt_46_30_the_villagers_obstrected_propagation_of_religion_avb_ap10035 తమ గ్రామంలో అన్య మతస్తులు మత ప్రచారం చెయ్యడానికి వీల్లేదంటూ ఆ ఊరంతా ఒకే మాట పై నిలబడింది. మత ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ గ్రామంలోకి వచ్చే దారిలో బ్యానర్ ను ఏర్పాటు చేశారు.ఇదెక్కడో కాదు గుంటూరు జిల్లా నగరం మండలం, కొలగాని వారిపాలెం లోని గ్రామస్తులు మత ప్రచారానికి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం. ఆ గ్రామంలో అందరు హిందువులే ఉన్నారు.అయితే ఇటీవల కొంతమంది అన్య మతస్తులు గ్రామంలోకి వచ్చి మతం మార్చుకోండి..మీకు ఎన్నో ప్రయోజనాలుంటాయి చెప్తున్నారని గ్రామస్తులు వాపోతున్నారు.తమ స్వలాభల కోసం మత ప్రచారాలు చేస్తూ ప్రజలను ప్రలోభాలకు గురి చేసి మత మార్పిడి చెయ్యాలని ప్రయత్నిస్తున్నారని తెలిపారు. మత ప్రచారం చట్ట రీత్యా నేరం కాబట్టి..అలాంటి వ్యక్తులు తమ గ్రామంలో ఎలాంటి ప్రచారం చెయ్యకుండా ఉండేందుకు "ఈ గ్రామంలో అందరూ హిందువులే అన్య మతస్తులు మత ప్రచారం చేయరాదు.చేసినచో కఠిన చర్యలు తీసుకొనబడతాయి అని ఫ్లెక్సీ ని ఏర్పాటు చేసుకున్నామన్నారు.మతాన్ని మార్చితే కన్నతల్లినే మార్చినట్లని..ఎవ్వరూ కూడా ప్రలోభాలకు గురై మత మార్పిడి చెయ్యెదని గ్రామస్తులు సూచిస్తున్నారు.

Body:బైట్..గ్రామస్తులు

Conclusion:ఈటీవీ కంట్రీబ్యుటర్ మీరాసాహెబ్..7075757517 రేపల్లె గుంటూరు జిల్లా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.