Home guard Attack: కృష్ణా జిల్లా పమిడిముక్కల పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు.. పెనమకూరు గ్రామానికి చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు. శ్రీనివాసరావు తనకు తెలిసిన వ్యక్తులకు.. హోంగార్డుకు చెందిన వారి ఇంటిని అద్దెకు ఇప్పించాడు. కాగా ఇంటిని అద్దెకు తీసుకున్న వ్యక్తి గత రెండు నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో.. శ్రీనివాసరావు, హోంగార్డుకు మధ్య వివాదం చెలరేగింది. దీంతో హోంగార్డు దురుసుగా ప్రవర్తించడంతో పాటు.. శ్రీనివాసరావు గుండెలపై గుద్దడంతో గుండెపోటుకు గురయ్యాడు. వెంటనే శ్రీనివాసరావును ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులకు కాల్ చేసి ఫిర్యాదు చేసినప్పటికీ కేసు నమోదు చేయలేదని బాధితుడు ఆరోపించాడు. ఆ హోంగార్డు గతంలో కూడా రెండు సార్లు దురుసు ప్రవర్తనతో సస్పెండ్ అయ్యారని బాధితుడు తెలిపారు.
రెచ్చిపోయిన హోంగార్డు.. ఇంటి అద్దె చెల్లించలేదని వ్యక్తిపై దాడి
Home guard Attack on a Person: ఇంటి అద్దె చెల్లించలేదని.. ఇంటిని అద్దెకు ఇప్పించిన వ్యక్తిపై దాడికి పాల్పడ్డాడు ఓ హోంగార్డు. దురుసుగా ప్రవర్తిస్తూ.. గుండెలపై గుద్దాడని బాధితుడు వాపోయాడు. గతంలో కూడా పలుమార్లు ఇలా దురుసు ప్రవర్తనతో ఆ హోంగార్డు సస్పెండ్ అయ్యాడని బాధితులు చెప్తున్నారు. ఈ ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది.
gineguard attack