జీఎన్రావు కమిటీ, బీసీజీ నివేదికలపై అధ్యయనం కోసం తొలిసారి భేటీ అయిన హైపవర్ కమిటీ...పాలన వికేంద్రీకరణపైనే ప్రధానంగా చర్చించింది.ఆర్ధిక మంత్రి బుగ్గన అధ్యక్షతన జరిగిన సమావేశానికి...ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్,హోం మంత్రి సుచరిత,పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ,మంత్రులు కన్నబాబు,పేర్ని నాని,గౌతమ్‌రెడ్డి,కొడాలి నాని హాజరయ్యారు.సుమారు4గంటలపాటు సుదీర్ఘంగా సమావేశం సాగింది. 3రాజధానులను ప్రతిపాదిస్తూ తామిచ్చిన నివేదికలోని అంశాలను జీఎన్‌రావు స్వయంగా కమిటీకి వివరించారు.విశాఖ నగరాన్నే రాజధానిగా ఎందుకు ఎంచుకున్నారని మంత్రులు...ప్రతినిధులను ప్రశ్నించారు.గ్రీన్‌ఫీల్డ్ రాజధాని నిర్మాణానికి అయ్యే ఖర్చును ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీ భరించలేదనే విషయం తమ అధ్యయనంలో వెల్లడైందన్న ప్రతినిధులు...ఆ మొత్తాన్ని పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు సహా ఇతర అభివృద్ధి పథకాలపై ఖర్చు చేయాలని సూచించారు.వాటి వల్ల ఫలితం అధికంగా ఉంటుందని పేర్కొన్నారు.దేశంలో జీడీపీవృద్ధి ఉన్న టాప్-10నగరాల జాబితాలో విశాఖ పదో స్థానంలో ఉందని ప్రతినిధులు వెల్లడించారు. 209బిలియన్‌యూఎస్డాలర్లతో ముంబయి తొలి స్థానంలో ఉండగా... 26బిలియన్‌యూఎస్డాలర్లతో విశాఖ పదో స్థానంలో ఉందని వివరించారు.
పాలన వికేంద్రీకరణతో పాటు ప్రతి జిల్లాలోనూ కీలక ప్రాజెక్టులు....చేపట్టాల్సిన అభివృద్ది పనులపై తాము దృష్టి సారించినట్లు కమిటీ తెలిపింది.అమరావతి ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలని సూచించింది.రైతులు ఉద్ధృతంగా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో...వారి అభిప్రాయాలను తెలుసుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అభిప్రాయపడింది.రెండు-మూడు ఆప్షన్లను రాజధాని రైతుల ముందుంచాలని కమిటీ సూచించింది.