విజయవాడ ప్రకాశం బ్యారేజి గేట్లను ఎత్తివేయడంతో, జల సవ్వడులతో దిగువకు వెల్తోన్న కృష్ణమ్మను చూసేందుకు ప్రజలు భారీ చేరుకుంటున్నారు. దీంతో బ్యారేజీ సందర్శకులతో రద్దీగా మారింది. గత మూడు రోజులాగ పాల నురగలతో ప్రవహిస్తున్న నీటిని చూసేందుకు ఉదయం నుంచే సందర్శకులు పోటెత్తుతున్నారు. ఈ రోజు వారాంతం కావటంతో విద్యార్ధులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో కృష్ణానది పరవళ్లను వీక్షిస్తున్నారు. దశాబ్ధకాలం తర్వాత ఇంత భారీగా నీటి ప్రవాహం రావటంతో విజయవాడలో ఆహ్లాద వాతావరణం నెలకొంది. నగరవాసులంతా ఆనందంతో సెల్ఫీలు దిగుతూ, సందడి చేస్తున్నారు.
కృష్ణమ్మ పరవళ్లతో ఒక సెల్ఫీ గురూ.. ! - PRAKASHAM BARRAGE
కృష్ణమ్మ పరవళ్లు చూస్తూ ఉల్లాసంతో, ఉత్సాహంతో ప్రకాశం బ్యారేజి వద్ద పర్యాటకులు సందడి వాతవరణం సృష్టిస్తున్నారు. అందులోనూ ఈ రోజు వారాంతరం కావడంతో సెల్ఫీలకూ పోజులిస్తూ స్థానికులు సైతం ఆనందపడుతున్నారు.
కృష్ణా బ్యారేజీ వద్ద సెల్ఫీకి పోజులిస్తున్న సందర్శకులు
ఇదీ చూడండి:వెలుగులు జిలుగులు...ప్రకృతి రంగులు..!