అవనిగడ్డ కృష్ణా జిల్లాలో ప్రధాన నియోజకవర్గ కేంద్రమైనప్పటికీ, డ్రైనేజీ సౌకర్యం సరిగా లేకపోవడంతో చిన్న చిన్న వర్షాలకే రోడ్లపై వర్షం నీరు నిలిచి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రధాన రహదారులతో సహా రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల పరిస్థతి మరీ దారుణంగా ఉంది. ఇందుకు నిదర్శనంగా సగం కూలిపోయిన పెంకులతో తహసీల్దార్ కార్యాలయం దర్శనమిస్తోంది. అధికారులకు అర్జీలివ్వటానికి వచ్చిన ప్రజలు ఆ పెంకులు ఎక్కడ తమపై కూలిపోతాయోనని భయపడుతున్నారు. తహసీల్దార్ కార్యాలయంలో వర్షపాతం నమోదు చేయటానికి ఏర్పాటు చేసిన పరికరం చుట్టూ వర్షం నీరు సగం వరకు చేరింది. దీనితో వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు అని ప్రజలు అధికారులను ప్రశ్నిస్తున్నారు.
అవనిగడ్డలో చెరువులను తలపిస్తున్న రోడ్లు - rainfall
కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో కురిసిన భారీ వర్షానికి గ్రామంలో రోడ్లన్నీ జలమయమయ్యాయి.
రోడ్లన్ని జలమయం