Guns Found Near Public Garden: హైదరాబాద్ పబ్లిక్‌గార్డెన్ జూబ్లీహాల్ సమీపంలో తుపాకులు బయటపడిన ఘటన కలకలం రేపింది. శాసనమండలి ఉద్యానవన శాఖ సిబ్బంది ఆ ప్రాంతంలో పెరిగిన చెట్లను కత్తిరిస్తున్నారు. అదేవిధంగా అక్కడ పేరుకుపోయిన చెత్తను తొలగిస్తుండగా.. ప్లాస్టిక్ కవర్లలలో మూడు తపంచాలు బయటపడ్డాయి. అవి తుప్పుపట్టి ఉన్నాయి. పారిశుద్ధ్య సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. తపంచాలు ఎక్కడినుంచి వచ్చాయి...? ఎవరు తెచ్చారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్ పబ్లిక్‌గార్డెన్‌లో చెత్త తొలగిస్తుండగా బయటపడిన తుపాకులు..! - Guns found while clearing garbage
Guns Found Near Public Garden: హైదరాబాద్ పబ్లిక్‌గార్డెన్ జూబ్లీహాల్ సమీపంలో తుపాకులు బయటపడిన ఘటన కలకలం సృష్టించింది. చెత్తను తొలగిస్తుండగా.. మూడు తపంచాలు బయటపడ్డాయి. అవి తుప్పుపట్టి ఉన్నాయి. పారిశుద్ధ్య సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. తుపాకులను స్వాధీనం చేసుకున్నారు.
పబ్లిక్‌గార్డెన్ లో బయటపడిన తుపాకులు