చుట్టూ ఎన్ని విహంగాలు ఉన్నా దీన్ని ఇట్టే కనిపెట్టేయొచ్చు. పొడవాటి మెడ.. ఆకర్షించే వర్ణాలతో చూడముచ్చటగా దర్శనమిస్తోంది. దీని పేరు పెద్ద తెల్లగూడబాతు(గ్రేట్ వైట్ పెలికాన్). ఈ జాతి పక్షులు ఏడాదికి ఒక్కసారి మాత్రమే భారతదేశానికి వస్తాయి. కృష్ణా జిల్లాలోని కొల్లేరు సరస్సుకు వచ్చే పక్షుల్లో వీటిని ప్రత్యేక అతిథిలుగా చెబుతారు. సెంట్రల్ సైబీరియా, తూర్పు యూరప్ నుంచి శీతాకాలంలో వలస వస్తుంటాయి. ఏటా డిసెంబరులో వచ్చి 75 రోజులు ఉంటాయి. కొల్లేరు ప్రాంతానికి ఆహారం కోసం మాత్రమే వస్తాయి. గుజరాత్‌లో ఎక్కువగా కనిపిస్తాయి. ఒక్కోపక్షి బరువు 5 నుంచి 9 కేజీల వరకు ఉంటుంది. అరకిలో ఉండే చేపలను సైతం సులభంగా ఎంతదూరమైనా తీసుకెళ్లగల సామర్థ్యం వీటి సొంతం. పర్యాటకులను ఆకర్షిస్తున్న ఈ పక్షి చూపరులను కళ్లు తిప్పుకోకుండా చేస్తోంది.
కొల్లేరు సరస్సులో 'తెల్లగూడబాతు' సొబగులు
కృష్ణా జిల్లాలోని కొల్లేరు సరస్సులో.. పెద్ద తెల్లగూడబాతు(గ్రేట్ వైట్ పెలికాన్) దర్శనమిచ్చాయి. ఈ జాతి పక్షులు ఏడాదికి ఒక్కసారి మాత్రమే.. ఆహారం కోసం భారతదేశానికి వలస వస్తుంటాయి.
కొల్లేరు సరస్సులో 'తెల్లగూడబాతు' సొబగులు