ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను ప్రారంభించారు. సీఎం యాప్ ద్వారా కనీస మద్దతు ధరకు పంట కొనుగోలు చేస్తామని తెలిపారు.

cotton purchasing centre at jaggayyapeta
పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను

By

Published : Nov 16, 2020, 4:01 PM IST

Updated : Nov 17, 2020, 1:21 PM IST

సీఎం జగన్ రైతుల పక్షపాతి అని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను అన్నారు. జగ్గయ్యపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఉదయభాను ప్రారంభించారు.

ప్రభుత్వ ఆదేశాల మేరకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 2020-21 సంవత్సరానికి సంబంధించి పత్తి పంటను కనీస మద్దతు ధరకు సీఎం యాప్ ద్వారా కొనుగోలు చేస్తారని తెలిపారు. జగ్గయ్యపేట మార్కెట్ యార్డులో పత్తి క్వింటాకు రూ.5,825 మద్దతు ధరకు పంట అమ్మవచ్చని రైతులకు విజ్ఞప్తి చేశారు.

Last Updated : Nov 17, 2020, 1:21 PM IST

ABOUT THE AUTHOR

...view details