ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆర్టీసీ విలీనానికి మరో అడుగు... ప్రజా రవాణా ఏర్పాటు!

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి కార్యాచరణ ప్రారంభమైంది. మొత్తం 51 వేల 448 మంది కార్మికులతో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రజా రవాణా విభాగంలో ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు.

goverenement-issued-orders-on-rtc-workers
goverenement-issued-orders-on-rtc-workers

By

Published : Dec 31, 2019, 12:33 AM IST

Updated : Dec 31, 2019, 7:46 AM IST

ఆర్టిసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా విలీనం చేసేందుకు అవసరమైన కార్యాచరణ చేపడుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నూతనంగా ప్రజా రవాణా విభాగం ఏర్పాటు చేస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. రవాణా, రహదారులు భవనాల శాఖ ఆధ్వర్యంలో ఈ ప్రజా రవాణా విభాగం పని చేస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారిన అనంతరం జీతాలు సీఎఫ్‌ఎంఎస్ నుంచి చెల్లించడం జరుగుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మొత్తం 51 వేల 448 మంది కార్మికులతో నూతనంగా ఏర్పాటైన ఈ ప్రజా రవాణా విభాగానికి డైరెక్టర్ లేదా కమిషనర్ అధిపతిగా వ్యవహరించనున్నారు.

Last Updated : Dec 31, 2019, 7:46 AM IST

ABOUT THE AUTHOR

...view details