- గ్లోవ్స్: చేతులకు సూక్ష్మజీవుల నుంచి రక్షణ కల్పించే గ్లోవ్స్‌ని వ్యాయామం తర్వాత షాంపూ వేసిన నీటిలో నానబెట్టి ఉతికేయాలి.
- స్పోర్ట్స్ బ్రా:నాణ్యమైన వాటిని మాత్రమే ఎంచుకోవాలి. గోరువెచ్చటి నీటిలో గాఢత తక్కువగా ఉండే డిటర్జెంట్ వేసి వీటిని నానబెట్టాలి. తర్వాత చేతులతో మృదువుగా రుద్దుతూ శుభ్రం చేస్తే సరిపోతుంది.
- యోగా మ్యాట్:కప్పు డిస్టిల్డ్ వాటర్‌లో కొన్ని చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ వేసి కీన్లింగ్ సొల్యూషన్‌ను తయారుచేసుకోవాలి. దీన్ని స్ప్రే బాటిల్‌లో పోసుకోవాలి. వర్కవుట్, యోగా చేసిన ప్రతిసారీ మ్యాట్ అంతా స్ప్రే చేయాలి. ఆ తర్వాత శుభ్రమైన వస్త్రంతో తుడిచేస్తే సరి.
- ప్రొటీన్ షేక్ బాటిల్స్:జిమ్‌కు వెళ్లే వారి వెంట ఉండే వస్తువుల్లో ఇదొకటి. దీన్ని కూడా క్రమం తప్పకుండా శుభ్రం చేస్తూ ఉండాలి. లేదంటే దుర్వాసన వస్తుంది. కప్పు వేడి నీటిలో కొన్ని చెంచాల ఆపిల్ సిడార్ వెనిగర్ వేసి రాత్రంతా అలా వదిలేయాలి.
- స్పోర్ట్స్ షూస్:జిమ్‌లో ఎక్కువగా ప్రభావితం అయ్యేవి ఇవే. వ్యాయమం తర్వాత వీటిని ఎండలో పెట్టాలి. అలా చేస్తే దుర్వాసన పోతుంది. తరచూ శుభ్రం చేస్తూ ఉండే ఎలాంటి ఇబ్బంది ఉండదు.