ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెలంగాణలో టపాసులపై నిషేధంపై స్టే ఇవ్వాలని సుప్రీంలో పిటిషన్ - tealangana fireworks news

టపాసులను కాల్చొద్దంటూ తెలంగాణ హైకోర్టు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ధర్మాసనం తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ఫైర్ వర్క్స్ డీలర్స్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో వ్యాజ్యం వేసింది.

firecracker dealers petion in supreme court against telangana high court ban on fireworks
తెలంగాణలో టపాసులపై నిషేధంపై స్టే ఇవ్వాలని సుప్రీంలో పిటిషన్

By

Published : Nov 13, 2020, 3:16 PM IST

దీపావళి పండుగ సందర్భంగా టపాసులను నిషేధిస్తూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది. న్యాయస్థానం ఆదేశాలను సవాల్ చేస్తూ... తెలంగాణ ఫైర్ వర్క్స్ డీలర్స్ అసోసియేషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వాలని ఫైర్ వర్క్స్ డీలర్స్ అసోషియేషన్... ఆ పిటిషన్​లో కోరింది.

దీపావళి సందర్భంగా టపాసుల కొనుగోలుకు కోట్లాది రూపాయలు వెచ్చించామని, ఆ వ్యాపారంపై వేలాది మంది ఆధారపడ్డారని అందులో పేర్కొన్నారు. ఈ సీజన్​లో వాటి అమ్మకాలపైనే వారి ఆధారపడ్డారని తెలిపారు. హైకోర్టు ఆదేశాలతో వారిపై తీవ్ర ఆర్దిక ప్రభావం చూపనుందని, నష్టాలపాలై రోడ్డున పడే పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే హైకోర్టు ఆదేశాలపై స్టే విధించి తమను ఆదుకోవాలని కోరారు.

మరోవైపు దీపావళి పండుగలో క్రాకర్స్ పేల్చకుండా ఆదేశాలు ఇవ్వాలని దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు ధర్మాసనం గురువారం సానుకూలంగా స్పందించి... టపాసుల అమ్మకాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు తెరిచిన షాపులను మూసి వేయించాలని ఉత్తర్వులిచ్చింది.

తెలంగాణాలోనూ ఎవ్వరు క్రాకర్స్ అమ్మడం గాని, కొనడం గాని చేయొద్దని స్పష్టం చేసింది. ఒకవేళ ఎవరైనా అమ్మకాలు జరిపితే కేసులు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. అలాగే ప్రచార మాధ్యమాల ద్వారా క్రాకర్స్ కాల్చకుండా ప్రభుత్వం ప్రజలకు తగిన అవగాహన కల్పించాలని కోరింది. ఈ విషయంపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలుపుతూ ఈ నెల 19న నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఇదీ చూడండి.బాల్య వివాహం చేసిన తల్లిదండ్రులు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన చిన్నారి

ABOUT THE AUTHOR

...view details