విత్తన చట్టం-2019 ముసాయిదా, రైతు ప్రయోజనాలు అంశంపై... విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో రైతు సంఘాలు అఖిలపక్ష సమావేశం నిర్వహించాయి. జాతీయస్థాయిలో సమగ్ర విత్తన చట్టం లేనందున, ఈ రంగంలో బహుళ జాతి కంపెనీల ప్రవేశం సులభమైందని సంఘం నేత జమలయ్య పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన విత్తన చట్టం కారణంగా... విత్తనంపై రైతు హక్కును పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉందన్నారు.
విజయవాడలో రైతు సంఘాల అఖిలపక్ష సమావేశం - విజయవాడలో రైతు సంఘాల అఖిల పక్ష సమావేశం
విజయవాడలో విత్తన చట్టం-2019 ముసాయిదా, అన్నదాత ప్రయోజనాల అంశంపై... రైతు సంఘాలు అఖిలపక్ష సమావేశం నిర్వహించాయి.
విజయవాడలో రైతు సంఘాల అఖిల పక్ష సమావేశం
రాష్ట్రస్థాయిలో విత్తన నమోదు కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. విత్తన రకం సరిగా లేనప్పుడు... రద్దు చేసే అధికారం కూడా కమిటీకి ఇవ్వాలన్నారు. బిల్లును ఆమోదించే ముందు... రైతు సంఘాలతో చర్చించి అభిప్రాయాలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా బిల్లుపై స్పందించి తమ వైఖరి చెప్పాలన్నారు.