ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 7, 2020, 5:20 PM IST

ETV Bharat / state

'పేద రైతుల నుంచి భూమి లాక్కొని పేదలకు ఇవ్వడమేంటి..?'

విజయవాడ గ్రామీణ ప్రాంతాలైన జక్కంపూడి, కొత్తూరు, తాడేపల్లి, వేమవరంలో భూ సేకరణపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగు భూములను ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. సర్కారు బలవంతంగా భూములు లాక్కుంటే ప్రాణ త్యాగానికైనా సిద్ధమని ప్రకటించారు.

farmers against land pooling in vijayawada
వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సమావేశం

ప్రభుత్వ భూ సేకరణపై రైతుల ఆవేదన

విజయవాడ గ్రామీణ ప్రాంతాల్లో రైతులు సాగు చేస్తున్న భూములు, ఇళ్ల స్థలాలను ప్రభుత్వం బలవంతంగా తీసుకోరాదని రైతులు డిమాండ్​ చేశారు. విజయవాడలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో అన్నదాతలు రౌండ్​ టేబుల్​ సమావేశం నిర్వహించారు. పేద రైతుల వద్ద భూములు లాక్కుని పేదలకు ఇవ్వడమేంటని కర్షకులు మండిపడ్డారు. ఏళ్ల తరబడి భూములు సాగు చేస్తూ జీవనోపాధి పొందుతున్నామని... ఇప్పుడు తమ నుంచి భూమలు లాక్కుంటే నిరాశ్రయులుగా మిగిలిపోతామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూములు వదులుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధమని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details