కృష్ణా జిల్లా పర్యటనలో ఉన్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును రాజధాని ప్రాంత రైతులు కలిశారు. తమకు న్యాయం చేయాలని వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ... తాను ప్రస్తుతం రాజ్యాంగ పదవిలో ఉన్నానని, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సబబుకాదని పేర్కొన్నారు. స్వర్ణభారతి ట్రస్టులో రాజకీయాలు మాట్లాడకూడదనే నియమం పెట్టుకున్నామని వెంకయ్య తెలిపారు. రైతుల బాధలు, ఇబ్బందులు తనకు తెలుసన్న ఆయన... సమస్య పరిష్కరించేవారికి సమాచారం అందిస్తానన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రాజధాని కోసం 33 వేల ఎకరాలు ఇచ్చారన్న వెంకయ్యనాయుడు... రాష్ట్రాభివృద్ధి కోసం చేయాల్సింది ఎప్పుడూ చేస్తూనే ఉంటానని స్పష్టం చేశారు.
'రాష్ట్రాభివృద్ధికి చేయాల్సింది ఎప్పుడూ చేస్తూనే ఉంటా'
కృష్ణాజిల్లాలో పర్యటిస్తున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును రాజధాని రైతులు కలిశారు. తమ ఆవేదనను వెంకయ్యకు వివరించారు. తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న తాను... రాజకీయాలపై మాట్లాడలేనని ఉపరాష్ట్రపతి అన్నారు. రైతుల ఇబ్బందులు అర్థం చేసుకున్నానన్న ఆయన అవసరమైన సాయం అందిస్తానని భరోసా ఇచ్చారు.
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
TAGGED:
Famers met vice president