కృష్ణా జిల్లాలో నకిలీ చలానాల కేసు దర్యాప్తులో పురోగతి కనిపిస్తోంది. మండవల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగిన నకిలీ చలనాలు వ్యవహారంలో ప్రధాన నిందితుడైన స్టాంపు వెండర్ దీరజ్ను అరెస్టు చేసినట్లు ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ తెలిపారు. ఈ మేరకు కైకలూరు టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. కేవలం నలభై ఎనిమిది గంటల్లో 640 నకిలీ చలనాలలో 450 చలానాలకు సంబంధించి రూ. కోటి రెండు లక్షల నగదును ప్రభుత్వ ఖజానాలో జమ చేయించినట్లు తెలిపారు.
Fake challans: నకిలీ ఈ చలానాల కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్.. - Fake challans accused arrest in krishna news
నకిలీ ఈ చలానాల కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్
12:40 August 26
ప్రభుత్వ ఖజానాలో రూ. 1.2 కోట్లు జమా
నకిలీ చలానాల కేసులో దర్యాప్తు కొనసాగుతోందని.. రిజిస్ట్రేషన్ చేయించుకున్న బాధితులు ఆందోళన చెందాల్సిన అవరసం లేదన్నారు. ఈ వ్యవహారంలో ఏ స్థాయి వాళ్లు ఉన్నా. బాధ్యులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే నిందితుల నుంచి నూరు శాతం నగదు రికవరీ చేస్తామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి
ILLEGAL EARNING: తండ్రి స్థానంలో కూర్చొని.. ఏడాదిలో రూ.కోట్లు కాజేసి
Last Updated : Aug 26, 2021, 5:30 PM IST