ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అన్న నినాదమే భాజపా లక్ష్యం అని దానికి అనుగుణంగా జనసేనతో కలిసి రాజధాని కోసం పోరాటం చేస్తామని మాజీ మంత్రి పైడి కొండల మాణిక్యాలరావు తెలిపారు. తెలుగుదేశం జేఏసీ పేరుతో రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతుల కోసమే పోరాటం చేస్తున్నారన్నారు. అయితే భాజపా మాత్రం ఐదు కోట్ల ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా అమరావతి కోసం ఉద్యమిస్తామన్నారు. కుల మతాలకు అతీతంగా రాజకీయం చేసే పార్టీయే తమదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో జగన్ పాలన తుగ్లక్ పరిపాలనను మైమరిపిస్తుందన్నారు.రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నారు. పరిపాలన వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులు చేయటం సరికాదన్నారు. పౌరసత్వ సవరణ చట్టంపై ప్రజలకు అవగాహన కలిగించేందుకు భాజపా ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
'ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని' నినాదమే భాజపా లక్ష్యం - రాజధానిపై మాజీ మంత్రి పైడికొండల వ్యాఖ్యలు
ఐదు కోట్ల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అమరావతి కోసం ఉద్యమిస్తామని మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. కుల మతాలకు అతీతంగా రాజకీయం చేసే పార్టీ తమదేనని ఆయన అన్నారు.
మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు