ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఎవర్నీ వదిలేది లేదు'

జగన్​ కుట్రలు చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. నేరాలు చేయడంలో వైకాపా నేతలు ఆరితేరారని...సైబర్​ నేరగాళ్లను ఎవరినీ వదిలేది లేదని సీఎం తెలిపారు. తప్పుడు దరఖాస్తులు చేసిన వారికి శిక్ష పడాలని అభిప్రాయపడ్డారు.

By

Published : Mar 4, 2019, 9:55 AM IST

Updated : Mar 4, 2019, 12:35 PM IST

'సీఎం కుర్చీ కోసం దిగజారుడు రాజకీయమా...!'

'సీఎం కుర్చీ కోసం దిగజారుడు రాజకీయమా...!'

పార్టీ నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్​లో మాట్లాడారు. వైకాపా చేసిన చర్యలకు సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కుర్చీ కోసం ఇలాంటి రాజకీయాలు తగవని... ఓట్ల నమోదు, ఓట్ల తొలగింపుపై గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేయాలని సూచించారు. వైకాపా దుశ్చర్యలను సహించబోమని దుయ్యబట్టారు. దొంగ సంతకాలు పెట్టిన వారందరినీ గుర్తించాలని పార్టీ నేతలకుసీఎం ఆదేశించారు. ఫోర్జరీ నేరానికి ఏడేళ్ల జైలుశిక్ష తప్పదని...సైబర్​ నేరాగాళ్లను ఎవరినీ వదిలేది లేదని సీఎం మండిపడ్డారు. విశాఖ జిల్లాలో 74 వేల తప్పుడు దరఖాస్తులు దారుణమని... అన్నింటిపై సమగ్ర విచారణ జరిపిస్తామని సీఎం అన్నారు. రాష్ట్రంలో అరాచక శక్తిగా జగన్​ మారారని...వైకాపాలో అందరు కరుడు కట్టిన నేరస్థులేనని దుయ్యబట్టారు.

Last Updated : Mar 4, 2019, 12:35 PM IST

ABOUT THE AUTHOR

...view details