కృష్ణా జిల్లా మచిలీపట్నం వ్యవసాయ మార్కెట్ యార్డ్లో మంత్రి పేర్ని వెంకట్రామయ్య 82 లక్షలతో సమగ్ర వ్యవసాయ ప్రయోగశాలకు శంకుస్థాపన చేశారు. ఎల్లప్పుడూ రైతుల సంక్షేమానికి వైకాపా కట్టుబడి ఉంటుందని మంత్రి తెలిపారు. మార్కెట్ కమిటీ వేసిన 3 నెలల వ్యవధిలోనే వ్యవసాయ ప్రయోగశాల రావడం శుభ పరిణామమని మార్కెట్ యార్డ్ చైర్మన్ అన్నారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్, మార్కెట్ యార్డ్ అధికారులు, వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సమగ్ర వ్యవసాయ ప్రయోగశాలకు శంకుస్థాపన
కృష్ణాజిల్లా మచిలీపట్నంలో సమగ్ర వ్యవసాయ ప్రయోగశాలకు మంత్రి పేర్ని నాని శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్, మార్కెట్ యార్డ్ అధికారులు, వైకాపా నాయకులు పాల్గొన్నారు.
సమగ్ర వ్యవసాయ ప్రయోగశాలకు శంకుస్థాపన