'పర్యావరణహితంగా భోగి వేడుకలు ' - పర్యావరణహితంగా భోగి వేడుకలు
సంక్రాంతిని బహిష్కరించాలని చంద్రబాబు పిలుపునివ్వడం దురదృష్టకరమని మంత్రి వెల్లంపల్లి అన్నారు. కృష్ణలంక పొట్టి శ్రీరాములు మున్సిపల్ ఉన్నత పాఠశాలలో భోగి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అమరావతి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో లక్ష ఆవుపిడకలతో పర్యావరణహితంగా భోగి వేడుకలు నిర్వహించారు.
సంక్రాంతిని బహిష్కరించాలని చంద్రబాబు పిలుపునివ్వడం దురదృష్టకరమని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. విజయవాడ కృష్ణలంక పొట్టి శ్రీరాములు మున్సిపల్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన భోగి వేడుకల్లో మంత్రి వెల్లంపల్లి, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు పాల్గొన్నారు. అమరావతి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏటా లక్ష ఆవుపిడకలతో పర్యావరణహితంగా ఈ భోగి వేడుకలు నిర్వహిస్తున్నారు. రైతుల పండుగ అయిన సంక్రాంతి రోజున రాజధాని రైతులు పండగకు దూరంగా ఉండడం బాధాకరమని మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు అన్నారు.