ఈ నెల 17న రాష్ట్ర స్థాయి ఆర్వో, ఏఆర్వోలకు కౌంటింగ్ పై శిక్షణ ఇవ్వనున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ నియోజకవర్గాల బాధ్యులకు శిక్షణ కల్పిస్తున్నామని ఆయన వివరించారు. విజయవాడలో నిర్వహించే ఈ శిక్షణ కార్యక్రమానికి దిల్లీ నుంచి నిపుణులు రానున్నారని చెప్పారు. కౌంటింగ్ విధుల్లో పాల్గొనే ఉద్యోగులను జిల్లా యూనిట్‌గా ర్యాండం పద్ధతిలో ఎంపిక చేయనున్నట్లు వివరించారు. మొదటి విడతలో కలెక్టర్ ఆధ్వర్యంలో ఉద్యోగుల ఎంపిక చేయనున్నామని... కౌంటింగ్ కి వారం ముందు మొదటి విడత ర్యాండమైజేషన్ నిర్వహిస్తామని చెప్పారు. ఓట్ల లెక్కింపునకు 24 గంటల ముందు రెండవ దశ ర్యాండం ఎంపిక చేసి నియోజకవర్గాల పరిశీలికుల ఆధ్వర్యంలో సిబ్బంది కేటాయింపు చేస్తామని ద్వివేది పేర్కొన్నారు. కౌంటింగ్ రోజు విధుల్లో పాల్గొనే తుది విడత సిబ్బంది కేటాయింపు చేస్తామని చెప్పారు. కౌంటింగ్ కేంద్రాల్లో ఉదయం 8.30 తర్వాత ఆర్వోల వద్ద కూడా మొబైల్స్ ఉండకూడదని ద్వివేది స్పష్టం చేశారు.
ఎన్నికల సిబ్బందికి శిక్షణ... దిల్లీ నుంచి నిపుణుల రాక! - technicians
ఓట్ల లెక్కింపునకు ఈసీ ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. లెక్కింపులో తడబాటుకు తావు లేకుండా ఉండేందుకు ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు దిల్లీ నుంచి నిపుణుల బృందాన్ని రంగంలోకి దింపనుంది.
పెద్ద సంఖ్యలో పోస్టల్ బ్యాలెట్‌లు
రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో పోస్టల్ బ్యాలెట్ లు జారీ చేశామని గోపాల కృష్ణ ద్వివేది వెల్లడించారు. 25 లోక్ సభ నియోజకవర్గాల పరిధిలో 3 లక్షల 17 వేల 291 ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకోగా.. ఎన్నికల విధుల్లో ఉన్న 3 లక్షల ఒక వెయ్యి మూడు ఉద్యోగులకి పోస్టల్ బ్యాలెట్ విడుదల చేసినట్లు తెలిపారు. 175 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 3 లక్షల 18 వేల 530 సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకోగా... 3 లక్షల 5 వేల 40 మందికి పోస్టల్ బ్యాలెట్‌లు జారీ చేసినట్లు ద్వివేది చెప్పారు. రాష్ట్రంలో దాదాపు 58 వేల మంది సర్వీస్ ఓటర్లకు ఆన్లైన్ బ్యాలెట్ విడుదల చేశామని వెల్లడించారు.