ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఘనంగా దేవి శరన్నవరాత్రులు.. గాయత్రీదేవి అలంకారంలో అమ్మవారి దర్శనం - శ్రీకాకుళం జిల్లాలో శరన్నవరాత్రులు

రాష్ట్ర వ్యాప్తంగా దసరా శరన్నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం అమ్మవారు గాయత్రీదేవి అవతారంలో దర్శనమిచ్చారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.

durga-devi-sharannavarathrulu-grandly-celebrations-in-andhrapradhesh
ఘనంగా దేవి శరన్నవరాత్రులు.. గాయత్రీదేవి అలంకారంలో అమ్మవారి దర్శనం

By

Published : Oct 19, 2020, 5:58 PM IST

పశ్చిమగోదావరి జిల్లాలో...

ఉండ్రాజవరం మండలం పాలంగి గ్రామంలోని కనకదుర్గ అమ్మవారి ఆలయంలో... నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వేడుకల సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. తెల్లవారుజాము నుంచే అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.

ప్రకాశం జిల్లాలో...

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గంలో దసరా శరన్నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. త్రిపురంతాకం ఆలయంలో అమ్మవారు చంద్రఘట రూపంలో దర్శనమిచ్చారు. యర్రగొండపాలెంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో పార్వతి దేవి అలంకరణలో అమ్మవారు ఆభయప్రదానం చేశారు.

కృష్ణాజిల్లాలో...

నూజివీడులోని శ్రీ కోట మహిషాసురమర్ధని ఆలయంలో... అమ్మవారు గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులు పూజలు చేశారు.

శ్రీకాకుళం జిల్లాలో...

ఆమదాలవలస గేదెలవానిపీటలోని ఉమామహేశ్వర స్వామి ఆలయంలో దసరా శరన్నవరాత్రులు సందర్భంగా చండీహోమం నిర్వహించారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో సంతోషంగా ఉండాలని ప్రత్యేక పూజలు చేశారు.

తూర్పుగోదావరి జిల్లాలో...

కోనసీమ వ్యాప్తంగా దసరా ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. అమలాపురంలోని శ్రీ దేవి అమ్మవారు గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. దుర్గాదేవి ఆలయాల్లో కుంకుమ పూజలు చేశారు.

ఇదీ చదవండి:

ఆరేళ్లలో 90 మంది అతివల బలి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details