దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఇంద్రకీలాద్రిపై రెండో రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తున్నారు. ఉదయాన్నే సుప్రభాత సేవతో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ రోజంతా అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చనలు, ఛండీ హోమాలు జరగటంతో పాటు సాయత్రం నగరోత్సవం జరుగుతుంది. బాలా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తున్న దుర్గా మాత సర్వ మంత్రాలకు మూల ప్రదాయనిగా కొలుస్తారు. మంత్రోశ్ఛరణ మెదట బాల త్రిపుర సుందరీ అమ్మవారి అనుగ్రహంతోనే జరగాలన్న విశ్వాసంతో అమ్మవారిని ఈ రోజు పూజిస్తారు. నగరోత్సవంలో భక్తులంతా పాల్గొని పూనీతులవ్వాలని ఆలయ పండితులు కోరుకున్నారు. ఇంద్రకీలాద్రిపై భక్తులుకు సకల సౌకర్యాలు కల్పించారు.
బాలా త్రిపుర సుందరి దర్శనానికి భక్తుల బారులు
సర్వమంత్రాలకు మూల ప్రదాయని శ్రీ బాలాత్రిపుర సుందరి దేవిగా రెండవ రోజు అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు దర్శనం చేసుకుని తరిస్తున్నారు.
రెండవ రోజు బాలా త్రిపురసుందరి దేవిగా దర్శనమిస్తున్న అమ్మవారు
అమ్మవారి సేవలో మాజీ మంత్రి
బాలా త్రిపురసుందరి దేవి అమ్మవారిని మాజీ మంత్రి చినరాజప్ప దర్శించుకున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించాయని..అవి మళ్ళీ యథాస్థితికి రావాలని అమ్మవారిని కోరుకున్నానన్నారు. గతంలో లిఫ్టుల ద్వారా భక్తులను పైకి తరలించేవారని, ఈసారీ వాటిని అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. అమ్మవారి అనుగ్రహం ప్రజలందిపైనా ఉండాలని కోరుకున్నారు.
ఇదీ చూడండి: