ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 23, 2021, 5:43 PM IST

ETV Bharat / state

గ్రూప్-1 మెయిన్స్ నిర్వహణపై అనుమానాలు: తెలుగు యువత

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పరీక్షలపై తమకు అనుమానాలు ఉన్నాయని తెలుగు యువత ఆక్షేపించింది. ఈ మేరకు తమ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్​ నేతృత్వంలో త్వరలోనే ప్రభుత్వ తీరును ఎండగట్టే కార్యక్రమం నిర్వహిస్తామని స్పష్టం చేసింది.

గ్రూప్ 1 మెయిన్స్ నిర్వహణపై అనుమానాలు : తెలుగు యువత
గ్రూప్ 1 మెయిన్స్ నిర్వహణపై అనుమానాలు : తెలుగు యువత

ఏపీపీఎస్సీ పరీక్షల నిర్వహణలో జరిగిన అవినీతి, అక్రమాలను త్వరలోనే తెలుగుదేశం బట్టబయలు చేస్తుందని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు తెలిపారు. ఈ మేరకు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్​ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణ, డిజిటల్ వాల్యుయేషన్​పై అభ్యర్థుల్లో అనుమానాలున్నాయన్నారు.

ఇప్పటికే కోర్టుకు..

పరీక్ష రాసిన కొందరు అభ్యర్థులు ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారని గుర్తు చేశారు. 7 వేల మంది పరీక్షలు రాస్తే ఇంటర్వ్యూలకు 340 మందిని మాత్రమే ఎంపిక చేయడమేంటని నిలదీశారు. పరీక్ష నిర్వహణకు ముందు డిజిటల్ వాల్యుయేషన్ ఉంటుందని ప్రభుత్వం, ఏపీపీఎస్సీ ఎక్కడా చెప్పలేదన్నారు.

ప్రభుత్వ తీరుపై అనుమానాలు..

ప్రశ్నపత్రాల తరలింపులో కూడా ప్రభుత్వ తీరుపై అనుమానాలున్నాయన్నారు. ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థుల జవాబు పత్రాలతో పాటు, ఎంపిక కాని వారి పత్రాలను కూడా ఆన్​లైన్​లో ఉంచాలని చినబాబు డిమాండ్‌ చేశారు. ఏపీపీఎస్సీ బోర్డు మెంబర్​గా సోనీవుడ్​ని నియమించడాన్ని తప్పుబట్టిన తెలుగు యువత నాయకుడు.. అనేక ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తిని రాజ్యాంగబద్ధమైన పదవిలో ఎలా నియమిస్తారని నిలదీశారు.

ఇవీ చూడండి :తెలంగాణ సరిహద్దులో.. భారీగా నిలిచిన వాహనాలు

ABOUT THE AUTHOR

...view details