కృష్ణాజిల్లా విజయవాడ బావాజీ పేటలోని మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో అమ్మవారిని కరెన్సీ నోట్లతో అలంకరించారు. ప్రతి ఏడాది కార్తీక మాసంలో ఇదే తరహా అలంకరణతో అమ్మవారు దర్శనమిస్తారు. రూపాయి నోటు నుంచి రెండువేల నోటు వరకు మూడు లక్షల విలువ చేసే నోట్లతో అమ్మవారి అలంకరణ చేశారు. మహాలక్ష్మి అమ్మవారి అలంకరణ చూసేందుకు భక్తులు తరలి వచ్చారు.
మహాలక్ష్మికి ధనలక్ష్మితో అలంకరణ - కరెన్సీ నోట్లతో మహాలక్ష్మి అమ్మవారి అలంకరణ కృష్ణా జిల్లా
విజయవాడ బావాజీ పేటలో మహాలక్ష్మి అమ్మవారిని కరెన్సీ నోట్లతో అద్భుతంగా అలకంరించారు. రంగు రంగుల డబ్బు నోట్లు అమ్మవారికి మరింత అందాన్నిచ్చాయంటూ భక్తులు అమ్మవారిని చూసేందుకు తరలి వచ్చారు.
కరెన్సీ నోట్లతో దర్శన మిస్తున్న మహాలక్ష్మి అమ్మవారు