తెదేపాను సంస్థాగతంగా బలోపేతం చేయాలని, యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు.. శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కింది స్థాయి నుంచి పార్టీకి ఎక్కడికక్కడ సరైన నాయకత్వాన్ని ఎన్నుకోవాలన్నారు. యువతకు పెద్ద పీట వేయాలనేదే తన అభిమతమని చంద్రబాబు స్పష్టం చేశారు. అందుకు పార్టీ సీనియర్ నేతలు సహకరించాలని కోరారు. విజయవాడ ఏ-కన్వెన్షన్ సెంటర్‌లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర స్థాయి సమావేశానికి చంద్రబాబు హాజరయ్యారు. వైకాపా ప్రభుత్వ తీరుపై ఆయన మండిపడ్డారు. ప్రజా సంక్షేమం వదిలేసి... తెదేపా నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చింతమనేనిపై కేసు మీద కేసు పెట్టి వేధిస్తున్నారని ఆవేదన చెందారు. పోలీసులు ఇలా పనిచేస్తారని తాను ఎన్నడూ అనుకోలేదన్నారు.
''పోలీసులు ఇలా పనిచేస్తారని జీవితంలో ఊహించలేదు'' - విజయవాడలో తెదేపా విస్తృతస్థాయి సమావేశం
వైకాపా నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో తెదేపా రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశానికి ఆయన హాజరయ్యారు. పార్టీ నేతలు, కార్యకర్తలపై అన్యాయంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి తిప్పుతున్నారని మండిపడ్డారు.