అవనిగడ్డ నియోజకవర్గంలో మోపిదేవి, కోడూరి నాగాయలంక, చల్లపల్లి తదితర మండలాల్లో భారీ వర్షం పడింది. దీంతో కొన్ని చోట్ల భారీ వృక్షాలు నేలకూలి రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. మోపిదేవి మండలంలో బొప్పాయి, చెరకు,అరటి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పలు చోట్ల విద్యుత్ వైర్లు తెగిపోవటంతో విద్యుత్ శాఖ అధికారులు మరమ్మత్తులు చేపట్టారు.
అవనిగడ్డ నియోజకవర్గంలో భారీ వర్షం.. వివిధ పంటలకు తీవ్ర నష్టం - krishna
కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజక వర్గంలో కురిసిన భారీ వర్షానికి పలు మండలాల్లో పంటలు నేలకొరగాయి.
భారీ వర్షాలకు నేలకొరిగిన పంటలు