కృష్ణా నది కరకట్ట వెంబడి నిర్మించిన అక్రమ కట్టడాలను అధికారులు తొలిగిస్తున్నారు. గతంలో నోటీసులు జారీ చేసిన భవనాలకు... ఇప్పటి వరకూ ఎటువంటి వివరణ రాకపోవడంపై నేరుగా సీఆర్డీఏ అధికారులు రంగంలోకి దిగారు. తెదేపా అధినేత చంద్రబాబు ప్రస్తుతం నివాసం ఉంటున్న లింగమనేని ఇంటికి ప్రభుత్వం నోటీసులు జారీ చేశారు. కృష్ణా నది కరకట్ట వెంబడి నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన మరో 24 కట్టడాలకు తాజాగా ప్రభుత్వం నోటీసులు జారీచేసింది. వీటిలో 5 నిర్మాణాల యజమానులు సెక్షన్ 115 (3) ప్రకారం వివరణ ఇచ్చారు. కానీ.. మౌఖిక వివరణ ఇవ్వాలని అధికారులు సూచించారు. మరో 19 మంది ఇచ్చిన వివరణలు పరిశీలనలో ఉన్నాయని తెలిపారు. వీరిలో పాతూరు కోటేశ్వరరావు అనే వ్యక్తి వివరణ సరిగా లేనందున కఠినచర్యలు చేపట్టామని అధికారులు స్పష్టం చేశారు.
కరకట్ట మీద 'అక్రమ నిర్మాణాలపై'.. అధికారుల ప్రత్యేక దృష్టి - కరకట్ట వెంబడి నిర్మించిన అక్రమ కట్టడాలను అధికారులు తొలిగిస్తున్నారు
కృష్ణానది కరకట్ట వెంబడి నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలు తొలిగించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. తాజాగా మరో 24 కట్టడాలకు నోటీసులు జారీచేసింది. నిర్మాణాల యజమానులను మౌఖికంగా వివరణ ఇవ్వాలని సీఆర్డీఏ అధికారులు ఆదేశించారు.

కృష్ణా కరకట్టపై 24 అక్రమకట్టడాలను నోటీసులు
కృష్ణా కరకట్టపై ఉన్న 24 అక్రమకట్టడాలను నోటీసులు
ఇదీ చదవండి :
TAGGED:
సీఆర్డీఏ