మీడియాపై ప్రభుత్వం ఎదురుదాడికి దిగటాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఖండించారు. సమస్యను పరిష్కరించాల్సిందిపోయి, మీడియాపై దాడికి దిగడమేంటని ప్రశ్నించారు. కరోనా మహమ్మారి ప్రబలుతున్నా, లెక్క చేయకుండా రైతుల ఇబ్బందులు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చిన మీడియాను మంత్రులు ఎదురుదాడికి దిగటం సరికాదన్నారు. రైతులను ఆదుకునేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఒక పక్క రైతుకు గిట్టుబాటు ధర లేకపోయినా, వినియోగదారుడికి అధిక ధరలకు విక్రయిస్తున్నా ప్రభుత్వం చోద్యం చూస్తుందని మండిపడ్డారు.
మీడియాపై ఎదురుదాడి సరికాదు: సీపీఐ రామకృష్ణ - ప్రభుత్వంపై మండిపడ్డ సీపీఐ రామకృష్ణ
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రభుత్వంపై మండిపడ్డారు. మీడియాపై ఎదురుదాడికి దిగటం సరికాదన్నారు. మున్సిపల్ కార్మికులకు జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించి తక్షణమే ఆదుకోవాలన్నారు.
ప్రభుత్వంపై మండిపడ్డ సీపీఐ రామకృష్ణ
కరోనా నివారణకు ముందు వరుసలో నిలబడి కృషి చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇవ్వటం లేదని, విశాఖలో 6 వేల మంది మున్సిపల్ కార్మికులకు సగం జీతాలే ఇచ్చారనీ ఆరోపించారు. పారిశుద్ధ్య కార్మికులకు పూర్తిగా జీతాలు చెల్లించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.