ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 31, 2020, 7:13 AM IST

ETV Bharat / state

ప్లాస్టిక్ వ్యర్థాలు తిని గోవు మృతి.. మరణరోదన చూసి స్థానికులు కంటతడి

విషాహారం వల్ల అనారోగ్యానికి గురైన ఆవు.. రక్తపు విరోచనాలతో మృతి చెందింది. మరణించే సమయంలో ఆ గోవు చేసిన ఆర్తనాదాలు.. కృష్ణా జిల్లా నందిగామ వాసులను కంటతడి పెట్టించాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తా చెదారం తినడంతోనే గోవు ప్రాణాలు కోల్పోయిందని.. గోపాలమిత్ర శంకర్, విశ్రాంత పశు వైద్యులు ఆత్కూరి ఆంజనేయులు తెలిపారు.

cow dead due to plastic wastage
ప్లాస్టిక్ వ్యర్థాలు తిని గోవు మృతి

కృష్ణా జిల్లా నందిగామలో ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తా చెదారం తిన్న గోవు.. రక్తపు విరోచనాలతో మృతి చెందిన ఘటన స్థానికుల హృదయాలను కలిచి వేసింది. పంచాయతీ కార్మికులు ఎనిమిది రోజులుగా సమ్మె చేయడం వల్ల కుండీల్లో చెత్త పేరుకుపోయింది. వీటిని తిని తీవ్ర అనారోగ్యానికి గురై ఆవు ఇబ్బంది పడింది. దానిని కాపాడేందుకు హిందూ ధర్మ రక్షణ సమితి రాష్ట్ర కార్యదరి వందేమాతరం అశోక్, ఆ సంఘం ప్రతినిధి శీను.. స్థానిక పశు వైద్యులను సంప్రదించారు.

స్థానిక గోపాలమిత్ర శంకర్, విశ్రాంత పశు వైద్యులు ఆత్కూరి ఆంజనేయులు గోవును పరీక్షించి.. రక్త విరోచనాలు అవుతున్నాయని, ఎక్కువ సేపు బతుకదని చెప్పారు. విషాహారం వల్ల అనారోగ్యానికి గురైన ఆవుకు చివరి ప్రయత్నంగా చికిత్స అందిస్తుండగానే ప్రాణాలు వదిలింది. ఆ గోమాత మరణరోదన అందరినీ కంట తడి పెట్టించింది. స్థానిక జానకిరామయ్య కాలనీలోని ముత్యాలమ్మ దేవాలయానికి.. దాతలు ఈ గోవును దానంగా ఇచ్చారని హిందూ ధర్మ రక్షణ సమితి ప్రతినిధులు తెలిపారు.

ఆవులను సంరక్షించకుండా యజమానులు రోడ్లపైకి వదిలేస్తుండగా.. చెత్త కుండీల్లో దొరికే ప్లాస్టిక్ వ్యర్ధాలు, చెత్త తిని పొట్ట నింపుకుంటున్నాయి. కొన్ని గోవులకు వ్యాపారులు పెట్టే తప్పుడు బెల్లమే ఆధారం. ఇలా చాలీ చాలని తిండితో కడుపు మాడ్చుకుంటూ.. ఎండకు ఎండుతూ, వర్షాలకు తడుస్తూ, చలికి వణుకుతూ రోడ్ల మీదే ఉంటున్నాయి. ఈ సంఘటనతోనైనా గోవులు రోడ్లమీదకు రాకుండా, అధికారులు వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు.

ఇదీ చదవండి:

రాబడి పెంచుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు..: ఏపీఎస్​​ ఆర్టీసీ ఎండీ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details