కరోనా నియంత్రణ చర్యలు కృష్ణా జిల్లాలో మరింత కఠినతరం చేస్తున్నట్లు కలెక్టర్ ఇంతియాజ్ ప్రకటించారు. వీటిల్లో భాగంగా పరిశుభ్రత(శానిటేషన్), మాస్క్ ధరించటం, భౌతిక దూరం (సోషల్ డిస్టెన్స్) పాటించటం తప్పనిసరి అని స్పష్టం చేశారు.
మాస్కు లేకండా రహదారిపైకి మెుదటిసారి వస్తే 100 రూపాయల జరిమానా ఉంటుందని... రెండోసారీ వస్తే మందలింపుతో పాటు నగదు జరిమానా, మూడోసారీ వస్తే వారిని క్వారంటైన్‌కు తరలిస్తామని కలెక్టర్ హెచ్చరించారు. మాస్కు ధరించి ఉండటం వలనే కరోనా పాజిటవ్ వచ్చిన వారితో సన్నిహితంగా ఉన్న వారికి సోకకుండా ఉండే అవకాశం ఉందన్నారు.