అమరావతిపై వైకాపా నేతలు చేస్తున్న ఆరోపణలను మరోసారి తిప్పికొట్టారు.. తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు. తన కులం ఉందనో.. తన కుటుంబం కోసమో తాను హైదరాబాద్ ను అభివృద్ధి చేయలేదంటూ ట్వీట్ చేశారు. సైబరాబాద్ నిర్మాణం, శంషాబాద్ విమానాశ్రయ అభివృద్ధి ఏ కులం కోసమో చేసింది కాదని స్పష్టం చేశారు. అలాగే.. అమరావతిని ఏ కులం కోసమో.. ఏ ప్రాంతం కోసమో నిర్మించాలని తాను అనుకోలేదని.. అలాంటి తనపై కులం ముద్ర వేస్తారా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలకు అద్భుతమైన రాజధానిని అందించాలన్న సంకల్పం తనదని.. ఐదు కోట్ల కలల రాజధాని అమరావతి అని ట్వీట్ లో చెప్పారు. రాజధాని రైతులకు అండగా నిలిచి పోరాటానికి సిద్ధమవుదామంటూ.. రాష్ట్ర ప్రజలకు, తెదేపా శ్రేణులకు పిలుపునిచ్చారు.
నా కోసం కాదు.. రాష్ట్రం కోసమే అమరావతి: చంద్రబాబు - chandrababu latest tweets
రాజధానికి కులం రంగు పూసి విచ్చిన్నం చేయాలనుకోవడం దుర్మార్గమని చంద్రబాబు ఆక్షేపించారు. వైకాపా నేతలు బుద్దిహీనతకు ఇది నిదర్శనమని దుయ్యబట్టారు. 5 కోట్ల ఆంధ్రుల కలల రాజధాని అమరావతి అన్న చంద్రబాబు... దానిని కాపాడుకోవడం అందరి బాధ్యతన్నారు.
babu