విజయవాడ సత్యనారాయణపురంలో గొలుసు దొంగతనం స్థానికంగా ఆందోళన రేకెత్తించింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో నుంచి... ద్విచక్రవాహనం పై వచ్చిన దుండగుడు బంగారు గొలుసును తెంపి చోరీ చేసి పరారయ్యాడు. నిత్యం.. రద్దీగా ఉండే సత్యనారాయణపురం మాజేటి వారి వీధిలో జరగిన ఈ ఘటన తీరుపై స్థానికులు ఉలిక్కిపడడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
సత్యనారాయణపురంలో గొలుసు చోరీ.. ఆందోళనలో స్థానికులు - విజయవాడలో గొలుసు దొంగతనం కేసులు తాజా వార్తలు
రద్దీగా ఉన్న ప్రాంతంలో మహిళ మెడలో నుంచి గొలుసును చోరీ చేసిన ఘటన విజయవాడ సత్యనారాయణపురంలో కలకలం సృష్టించింది. ఎప్పుడూ.. జనం తిరుగుతుండే ప్రాంతంలో జరిగిన చైన్ స్నాచింగ్ ఘటనపై.. స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

సత్యనారాయణపురంలో గొలుసు చోరీ